తెదేపా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ లోకేశ్ చేసిన ట్వీట్‌పై హోంమంత్రి సుచరిత ఘాటుగా స్పందించారు. గతంలో మహిళా అధికారిని చెంప దెబ్బ కొట్టినా పట్టించుకోని తెదేపా నేతలు... ఇప్పుడు అనవసరంగా రాద్ధాంతం చేస్తోన్నారన్నారు. తెదేపా ప్రభుత్వ అన్యాయాలను నిలదీసినందుకు వైకాపా ఎమ్యెల్యే రోజాను అసెంబ్లీకి రాకుండా అడ్డుపడిన వారికి... వైకాపా గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. ఇటీవల జరిగిన గొడవల్లో తెదేపా కార్యకర్తలు 44 మంది గాయపడితే వైకాపా చెందిన 57 మంది గాయపడ్డారని తెలిపారు. జగన్‌పై జరిగిన దాడి ఘటనను కోడికత్తి అని ప్రచారం చేసిన తెదేపా... శాంతిభద్రతల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ చిన్న ఘటననైనా ఉపేక్షించేది లేదని సుచరిత స్పష్టం చేశారు.
"తెదేపా కంటే.. వైకాపా నేతలపైనే దాడులెక్కువ.." - సుచరిత
ఇటీవల జరిగిన గొడవల్లో తెదేపా కార్యకర్తల కన్నా వైకాపా నేతలే ఎక్కువ మంది గాయపడ్డారని హోంమంత్రి సుచరిత అన్నారు. ఎమ్మెల్సీ లోకేశ్ చేసిన ట్వీట్‌పై ఆమె స్పందించారు. గతంలో సంఘటనలను గుర్తుచేశారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా సహించేది లేదని తెలిపారు.
హోంమంత్రి సుచరిత
ఇదీ చదవండి : ప్రకాశం బ్యారేజీలో కేసీఆర్... ఏం చేశారంటే!