తెదేపా కార్యకర్తలపై వైకాపా దాడులు అవాస్తవం: హోంమంత్రి - home minister
తమ ప్రభుత్వం శాంతిభద్రతలకు అధిక ప్రాధానం ఇస్తోందని హోంమత్రి సుచరిత స్పష్టం చేశారు. దాడులకు పాల్పడేవారు ఎవరైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తెదేపా కార్యకర్తలపై వైకాపా నేతలు దాడులు చేస్తున్నారన్నది అవాస్తవమని...ఉనికి చాటుకునేందుకే తెదేపా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని సుచరిత అన్నారు.
home-minister
ప్రభుత్వం శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యమిస్తోందని.....హోంమంత్రి సుచరిత చెప్పారు.దాడులకు పాల్పడుతున్న వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.తెలుగుదేశం కార్యకర్తలపై వైకాపా నేతలు దాడులు చేస్తున్నారన్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు.తెలుగుదేశం నాయకులు ఉనికి చాటుకునేందుకే తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.