పోలీసు శాఖలో పనిచేస్తోన్న హోం గార్డుల వేతనాల పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో జీతాల పెంపునకు ఆమోద ముద్ర వేశారు. ప్రతిపాదనలు తెప్పించి వీలైనంత త్వరగా హామీని అమలు చేయాలని సీఎం జగన్ మంత్రి మండలిని ఆదేశించారు. హోంగార్డుల వేతనాలను 18 వేల నుంచి 20 వేల 250కి పెంచుతూ వెంటనే ప్రతిపాదనలు పంపాలని డీజీపీని ప్రభుత్వం కోరింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కె.ఆర్.ఎం.కిషోర్ కుమార్ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపాదనలు వచ్చిన వెంటనే సీఎం ఆమోద ముద్రవేసి వేతనాలు పెంపు అమలు చేయనున్నారు.
హోంగార్డుల వేతనాలు పెంపు
హోంగార్డుల వేతనాన్ని పెంచాలని నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ భేటీలో వేతనాల పెంపుపై సీఎం జగన్ మంత్రులతో చర్చించారు. వీలైనంత త్వరలో పెంపు అమలు చేయాలని భావిస్తోంది.
హోంగార్డుల వేతనాలు పెంపు