గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కాప్రా, సైనిక్‌పురి, ఈసీఐఎల్, జీడిమెట్ల, సురారం, కొంపల్లి, సుచిత్రలో మోస్తరు వర్షం పడింది. అంబర్‌పేట, తిరుమలనగర్ రహదారిపై చెట్టు విరిగిపడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది రహదారులపై నీరు నిలువకుండా చర్యలు చేపడుతున్నారు.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం - rain
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కాప్రా, సైనిక్‌పురి, ఈసీఐఎల్‌లో మోస్తరు వర్షం పడింది. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో వర్షం
కాలనీలోకి నీరు
గచ్చిబౌలి ఖాజాగూడలోని సాయి వైభవ్ కాలనీలోకి వరద నీరు వచ్చి చేరడం వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఖాజాగూడా పెద్ద చెరువు నుంచి వస్తున్న వరద నీరు కాలనీలోకి చేరింది.
ఇవీ చూడండి: చంద్రబాబు కుటుంబానికి భద్రత కుదింపు
Last Updated : Jun 25, 2019, 8:03 PM IST