రాష్ట్రవ్యాప్తంగా 258 కేంద్రాల్లోగ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభమైంది. 13 జిల్లాల్లోనిఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లుగా ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు. 169 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్‌కు లక్షా 14వేల 473మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షకు అరగంట ముందుగా అభ్యర్థులనులోనికి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి 12వరకు పరీక్ష జరిగితే... మధ్యాహ్నం 2గంటల నుంచి 4గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రశాంతంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష - wise'
రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పేపర్-1 పరీక్ష 10 గంటలకు ప్రారంభమైంది. 169 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ కు లక్షా 14వేల 473మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ప్రశాంతంగా జరుగుతున్న గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష