అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పచుకోవాలంటే గ్రీన్‌కార్డ్ ఉండాల్సిందే. ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేస్తున్న గ్రీన్‌కార్డ్ నిబంధనల్లో పలు మార్పులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన బిల్లు శుక్రవారం చట్టసభల ముందుకొచ్చింది. ఎంతో కాలంగా అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులు గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నారు.
గూగుల్‌తో పాటు సిలికాన్ వాలీలోని ఇతర ఐటీ సంస్థలు ఈ బిల్లుకు ఎప్పటినుంచో మద్దతిస్తూ వస్తున్నాయి. ఉద్యోగాల్లో నిష్ణాతులైన వలసదారులకు గ్రీన్‌కార్డు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.
ఫెయిర్‌నెస్ ఫర్ హై-స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ (హెచ్ఆర్1044) బిల్లును సెనేట్‌లో రిపబ్లికన్ నేత మైక్ లీ, డెమోక్రటిక్ అధ్యక్ష్య అభ్యర్థి కమలా హారిస్ ప్రవేశపెట్టారు. ఇరు సభల్లో బిల్లు ఆమోదం పొందితే చట్టంగా మారనుంది. అదే జరిగితే గత పదేళ్లకు పైగా గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తోన్న వేలాది మంది భారతీయులకు గ్రీన్‌కార్డు సులభంగా మంజూరు కానుంది.