పదో తరగతి పరీక్షల్లో మార్పులు... ఇంటర్నల్స్ రద్దు - internal marks
విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం... దీనిలో భాగంగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులను ఎత్తివేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇంటర్నల్(అంతర్గత) మార్కులు ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది వరకూ పబ్లిక్ పరీక్షల్లో 20 శాతం మార్కులు ఇంటర్నల్స్‌కు కేటాయించిన ప్రభుత్వం ఇప్పుడు పాత పద్ధతికి స్వస్తి చెప్పింది. ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారం ఇంటర్నల్ మార్కులను వేసుకుంటున్నాయన్న కారణంతో పాత విధానానికి స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే పరీక్షల్లో కొత్త వాల్యుయేషన్ విధానాన్ని తీసుకొస్తూ నిర్ణయించారు. మొత్తంగా పదో తరగతి పరీక్షల్లో ఇది నూతన సంస్కరణగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది నుంచి ఆరు సబ్జెక్టులకు 11 ప్రశ్నాపత్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.