ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

యువతి అపహరణకు యువకుడి యత్నం.. కాపాడిన స్థానికులు - kidnap

పశ్చిమగోదావరి జిల్లా విస్సాకోడేరులో యువతి కిడ్నాప్ యత్నం స్థానికంగా సంచలనం సృష్టించింది. కారులో వచ్చిన యువకుడు యువతిని అపహరించడానికి ప్రయత్నించాడు. స్థానికుల ఆ కారును వెంబడించి.. యువతిని కాపాడారు.

యువతి కిడ్నాప్​కు యత్నించిన యువకుడు

By

Published : Apr 30, 2019, 7:29 PM IST

యువతి కిడ్నాప్​కు యత్నించిన యువకుడు

పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరులో ఓ దుండగుడు యువతిని కిడ్నాప్ చేయడానికి విఫలయత్నం చేశాడు. విస్సాకోడేరులో నివాసముంటున్న యువతి.. తన తల్లితో కలిసి స్థానికంగా ఉన్న ఓ ఇంటర్నెట్ సెంటర్​కు వెళ్లింది. కొంతకాలంగా యువతి వెంటపడుతున్న షేక్ నయీమ్ తుల్లా అలియాస్ కాలిష్ అనే యువకుడు.. ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేయడానికి యత్నించాడు. యువతి తల్లి కేకలతో స్పందించిన స్థానికులు కారును వెంబడించారు. భీమవరం మండలం తాడేరు సమీపంలో అడ్డగించారు. నయీమ్​ను పట్టుకుని యువతిని రక్షించారు. నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో నయీమ్​కు సహకరించిన మరో యువకుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు పాలకోడేరు పోలీసులు విచారణ చేపట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details