ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

విశాఖ అర్బన్​ తెదేపా అధ్యక్షుడిగా రెహమాన్​ - ganta

సీఎం చంద్రబాబు దార్శనికత కలిగిన నేత అని మంత్రి గంటా శ్రీనివాస్​ పేర్కొన్నారు. విశాఖ తెదేపా కార్యాలయంలో పార్టీ పట్టణ జిల్లా అధ్యక్షునిగా ఎస్​.ఏ. రెహమాన్​ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.

మంత్రి గంటా శ్రీనివాస్​

By

Published : Mar 27, 2019, 11:31 PM IST

విశాఖ తెదేపా కార్యాలయంలో...
ముఖ్యమంత్రి చంద్రబాబు 40 సంవత్సరాల అనుభవం గల రాజకీయ నేత అనిమంత్రి గంటా శ్రీనివాస్​ అభివర్ణించారు. విశాఖపట్టణం (నగర) జిల్లా అధ్యక్షుడిగా ఎస్.ఎ.రెహమాన్​ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో అన్ని అసెంబ్లీ, పార్లమెంట్​ స్థానాలను కైవసం చేసుకునేందుకు కార్యకర్తలంతా సమష్టిగా శ్రమించాలని కోరారు. సమావేశానికి ఎమ్మెల్యే గణబాబు హాజరయ్యారు. సమావేశానంతరం విశాఖ (ఉత్తర) నియోజకవర్గంలో గంటా రోడ్​షో నిర్వహించారు. తెదేపా పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.

ABOUT THE AUTHOR

...view details