రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసాయి.ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.ఈ మేరకు ఆర్టీజీఎస్..ఇప్పటికే సూచనలు జారీ చేసింది.ఈనెల9వరకు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది.ఈ నెల11, 12తేదీల్లో...రాయలసీమ జిల్లాలను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని.. 13, 14తేదీల్లో దక్షిణ కోస్తా ప్రాంతాలకూ విస్తారిస్తాయని అంచనా వేసింది.
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం ఎస్.అమరవరంలో పిడుగుపడింది.పశువుల కాపరి గేదెలు మేపుతుండగా పిడుగు పడిన పరిస్థితుల్లో...కాపరితో పాటు ఓ గేదె మృతి చెందింది.ఉంగుటూరు మండలం పెద్దవుటపల్లిలో పిడుగుపాటుకు యువకుడు మృతి చెందాడు.నాగవరప్పాడులో ఇళ్ల మధ్యలో కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది.గుంటూరుజిల్లా మాచర్లలో మబ్బులు కమ్ముకున్నాయి.నరసరావుపేటతో విద్యుత్ సరఫరా నిలిచి..ప్రజలు ఇబ్బందులు పడ్డారు.అమృతలూరు,పెదకూరపాడు మండలంలో కురిసిన వర్షాలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.వినుకొండ-కారంపూడి రహదారిలో వర్షానికి రాకపోకలు నిలిచాయి.ప్రకాశం జిల్లా చీరాలలో సాయంత్రం వర్షం కురిసింది...వేటపాలెం,చిన్నగంజాం ప్రాంతాల్లో వాతావరణం చల్లపడటంతో చల్లని గాలులను ప్రజలు ఆస్వాదిస్తున్నారు.