ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'రాజకీయ ప్రత్యామ్నాయం కోసమే కూటమి' - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

రాజకీయ ప్రత్యామ్నాయం కోసమే వామపక్ష, జనసేన, బహుజన సమాజ్ పార్టీలు కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కేంద్రం, రాష్ట్రంలోని అధికారంలోకి వచ్చిన పార్టీలు ఎంతమేరకు తమ వాగ్దానాలు నిలబెట్టుకున్నాయో ఓటర్లు ఆలోచించాలన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

By

Published : Apr 4, 2019, 9:04 AM IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
రాజకీయ ప్రత్యామ్నాయం కోసమే వామపక్ష, జనసేన, బహుజన సమాజ్ పార్టీలు కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయనిసీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కేంద్రం, రాష్ట్రంలోని అధికారంలోకి వచ్చిన పార్టీలు ఎంతమేరకు తమ వాగ్దానాలను నిలబెట్టుకున్నాయో ఓటర్లు ఆలోచించాలని విజయవాడ ప్రెస్ క్లబ్​లో జరిగిన సమావేశంలో సూచించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఏ అంశాలైతే ఉండాలని ఎన్డీయే ప్రభుత్వం నాడు డిమాండ్ చేసిందో... నేడు వాటిని అమలు చేయడంలో భాజపా పూర్తిగా విఫలమైందన్నారు. తమ కూటమి అధికారంలోకి వచ్చాక విద్య , వైద్యం పూర్తిగా ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details