ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

విదేశీ జంట...చోరీల్లో ముందంట! - చోరీ

న్యూజిలాండ్ నుంచి వచ్చినట్లు ప్రచారం చేసుకుంటోన్న ఓ విదేశీ జంట...కర్నూలులోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలో దోపిడికి పాల్పడ్డారు. సంస్థ ప్రతినిధుల దృష్టి మరల్చి రూ. 1.40 లక్షల విలువైన విదేశీ కరెన్సీతో ఉడాయించారు.

విదేశీ జంట...చోరీల్లో ముందంట!

By

Published : Jun 16, 2019, 7:01 AM IST

విదేశీ జంట...చోరీల్లో ముందంట!
కర్నూలులోని అబ్దుల్లాఖాన్ ఎస్టేట్​లో ఉన్న స్కంద దుకాణ సముదాయంలోని బజ్​ పాక్‌టూ ట్రావెల్స్ ఆఫీసులో చోరీ జరిగింది. ఈనెల 13వ తేదీన ఓ విదేశీ జంట ఈ షాపుకు వచ్చారు. తాము న్యూజిలాండ్ నుండి వచ్చినట్లు చెప్పిన ఆ జంట.. నగదు మార్చుకోవాలని నమ్మించారు. షాపులో పనిచేస్తోన్న వారి దృష్టి మళ్లించి రూ.1.40 లక్షల విలువచేసే విదేశీ కరెన్సీని తస్కరించారు. ఘటనపై ట్రావెల్స్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల పరిశీలించి నిందితులను గుర్తించారు. ఈ నెల 10న కొచ్చిన్‌, 11న మైసూరు ప్రాంతాల్లో...ఇటువంటి నేరాలకు వీరు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details