ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ప్రచార హోరు.. ఆకాశానికి పూల ధరలు - రెక్కలు

అభిమానం బంతిపూల ధరను పెంచేసింది... వేడుకలు లేని కాలంలోనూ పువ్వులు కొనాలంటే అమ్మో అనేలా పరిస్థితి వచ్చింది. ప్రచార హోరుతో క్షణాల్లోనే పూలన్నీ అమ్ముడైపోతున్నాయి.

ప్రచార హోరుతో పైపైకి బంతి పూల ధరలు

By

Published : Apr 6, 2019, 5:22 PM IST

ప్రచార హోరుతో పైపైకి బంతి పూల ధరలు

ఎన్నికల ప్రచారంలో పూలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటాయి. ప్రచార రథం అలంకరణ నుంచి నాయకుడి మెడలో వేసే దండ వరకు అంతా ప్రత్యేకంగా ఉండాలనుకుంటాయి పార్టీ శ్రేణులు.

గజమాలలతో ఘన సన్మానం
ప్రియమైన నేత వచ్చే దారిలో కొందరు పూలు జల్లుతుంటే... మరికొందరు గజమాలలతో సత్కరిస్తుంటారు. దీని కోసం ఎక్కువ బంతి పూలనే వినియోగిస్తుంటారు. అందుకే వాటి ధర అమాంతం పెరిగిపోయింది.

పంట పండింది
మెచ్చే నాయకుడు వచ్చే మార్గాన్ని బంతిపూలతో నింపేవారు కొందరు ఉంటే.. ఇంకొందరు పూలజల్లు కురిపిస్తుంటారు. ఇంకొందరు మరో ముందడుగు వేసి భారీ క్రేన్లతో గజమాలలు సిద్ధం చేస్తుంటారు. ఇలా శ్రేణుల ప్రయాస... నాయకుణ్ని ఎంత వరకు మెప్పిస్తుందో తెలియదు గానీ... వ్యాపారుల పంట మాత్రం పండుతోంది.


సంతోషంలో వ్యాపారులు
పెరిగిన పూల డిమాండుతో వ్యాపారులు పండగ చేసుకుంటున్నారు. సాధారణ రోజుల్లో కిలో 30 రూపాయలు ఉండే బంతిపూలు.. ప్రస్తుతం 70 రూపాయల వరకు పలుకుతున్నాయి. ఇరవై వేల వరకు ధర పలికే భారీ మాలలకు కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ఒక్కోదాన్ని తయారు చేసేందుకు 7 గంటల వరకు సమయం పడుతోందంటూ వ్యాపారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి..

సార్వత్రిక ఎన్నికలకు.. సప్త సముద్రాలు దాటి..!

ABOUT THE AUTHOR

...view details