ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

"అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేయండి"

అట్టడుగు వర్గాల ఓట్లతో అఖండ విజయం సాధించిన వైకాపా వారి అభ్యున్నతికి పాటుపడాలని సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సూచించారు. జగన్ నవరత్నాల అమలుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని, ఇతర మౌలిక అంశాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

సీపీఎం నేత బీవీ రాఘవులు

By

Published : May 29, 2019, 3:10 PM IST


ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలు, నవరత్నాలు అమలుతోనే రాష్ట్రాభివృద్ధి సంపూర్ణం కాదని...ఇతర మౌలిక అంశాలపైన కూడా జగన్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు. సీఐటీయూ స్వర్ణత్సోవ వేడుకల్లో భాగంగా తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. "నూతన ప్రభుత్వాలు - సవాళ్లు" అనే అంశంపై బీవీ రాఘవులు ఈ సదస్సులో మాట్లాడారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి జగన్ కృషి చేయాలని కోరారు. బడుగు, బలహీన, దళిత ఓటర్లను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చిన వైకాపా... వారి అభ్యున్నతికి పాటుపడాలనన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక పర్యటనకు వచ్చిన జగన్ తితిదేలో పనిచేస్తోన్న ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కేంద్రంలో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడతున్న మోదీకి లౌకిక అంశాలు పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు.

సీపీఎం నేత బీవీ రాఘవులు

ABOUT THE AUTHOR

...view details