గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని ఎర్రగుంట్లపాడుకు చెందిన రైతు పోచం శ్రీనివాసరావు పురుగుల మందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాసరావుకు రెండు ఎకరాల భూమి ఉంది. మరికొంత భూమిని కౌలు తీసుకుని సాగు చేస్తున్నాడు. రబీ పంటలో పత్తి, మిరప పంటలు వేశాడు. సరైన ధర లేక, పెట్టుబడి పెట్టిన డబ్బులు రాలేదు. చివరికి ఆరు లక్షల రూపాయలు అప్పు కావటంతో.. మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.
అప్పుల బాధ తాళలేక అన్నదాత బలవన్మరణం - debt
అప్పుల బాధ తాళలేక ఎర్రగుంట్లపాడుకు చెందిన రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కౌలుకు భూమి తీసుకొని పత్తి, మిరప పంటలు సాగు చేసిన రైతుకి అప్పులే మిగిలాయి. దీంతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అప్పుల బాధ తాళలేక అన్నదాత మృతి