జలవనరుల శాఖ నోడల్ ఏజెన్సీగా ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జలవనరులశాఖ చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్‌ని కన్వీనర్ నియమిస్తూ...8 మంది సభ్యుల సాంకేతిక కమిటీని ఏర్పాటుచేశారు. టెండర్ల పూర్తయిన పనులు ప్రారంభం కాని ప్రాజెక్టులు, 25 శాతం కంటే తక్కువ పూర్తయిన ప్రాజెక్టులపై ఈ కమిటీ సమీక్ష చేయనుంది.
ఇంజినీరింగ్ ప్రాజెక్టులపై అధ్యయన కమిటీ - expert
సాగునీటి, సీఆర్డీఏ, రోడ్లు భవనాల శాఖలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రభుత్వం 8 మంది సభ్యులతో నిపుణుల కమిటీని నియమించింది. జలవనరులశాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేసే ఈ కమిటీ 45 రోజుల్లో నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి.
సాగునీటి, సీఆర్డీఏ ప్రాజెక్టులపై అధ్యయన కమిటీ
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, సీఆర్డీఏ, రోడ్లు భవనాలశాఖలో ప్రస్తుతం జరుగుతోన్న ప్రాజెక్టులపై నిపుణుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 8 మంది విశ్రాంత ఇంజినీరింగ్ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తూ జలవనరుల శాఖ ఆదేశాలు ఇచ్చింది. పనుల్లో పారదర్శకత, అవినీతి నిర్మూలన, అంచనాలు పెంపు, టెండరింగ్ ప్రక్రియ వంటి అంశాలను ఈ సాంకేతిక కమిటీ అధ్యయనం చేయనుంది. 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన ప్రాజెక్టులపై సమీక్ష చేసి ప్రభుత్వానికి నివేదించనుంది.
అవసరమైతే రీటెండరింగ్‌కు వెళ్లే అంశాలను సూచించాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశించింది. ఈ కమిటీ తమ నివేదికను 45 రోజుల్లోగా అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. కమిటీ కార్యనిర్వహణకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇదీ చదవండి :నేడు దిల్లీలో వైకాపా పార్లమెంటరీ పార్టీ భేటీ