ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'నీతిగా ఉంటాం.. నిజాయితీగా బాధ్యతలు నిర్వర్తిస్తాం' - పోలీసుల పేరేడ్

శిక్షణ పూర్తి చేసుకుని బాధ్యతలు స్వీకరించబోతున్న 42 మంది పోలీసుల పాసింగ్ అవుట్ పేరేడ్ కార్యక్రమం చిత్తూరు జిల్లా కల్యాణి డ్యాం శిక్షణా కళాశాలలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి నారాణయ స్వామి హాజరయ్యారు.

గౌరవవందనం స్వీకరిస్తోన్న ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి

By

Published : Jun 29, 2019, 6:53 PM IST

ఆకట్టుకున్న పోలీసుల పాసింగ్ అవుట్ పేరేడ్

చిత్తూరు జిల్లా తిరుపతి కల్యాణి డ్యాం పోలీసుల కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకుని బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైన పోలీసులు.. పాసింగ్ అవుట్ పరేడ్ చేశారు. ఈ కేంద్రంలో 42 మంది అసిస్టెంట్ ఎక్సైజ్, ప్రొహిబిషన్ సూపరింటెండెంట్​లు, సబ్​ ఇన్​స్పెక్టర్ల బృందం ఆరు నెలల శిక్షణను పూర్తి చేసుకుంది. వీరి పాసింగ్ అవుట్ పరేడ్ తో పాటు.. ధ్రువపత్రాలు అందించే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు. ధ్రువపత్రాలు అందుకున్న పోలీసులు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా తమకు అందించే బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తామని తెలిపారు. తిరుపతి అర్బన్ డెవలప్​మెంట్ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్​ రెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details