ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఎన్నికల వేళ... ఒక్కరోజే కోటి పట్టివేత

లోక్​సభకు ఎన్నికల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు. సోమవారం హవాలా వ్యాపారులను అరెస్ట్ చేసి సుమారు కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Mar 12, 2019, 5:27 PM IST

ఎన్నికల వేళ... అప్పుడే కోటి పట్టివేత

ఎన్నికల వేళ... అప్పుడే కోటి పట్టివేత
తెలంగాణలోని హైదరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో మరో హవాలా రాకెట్‌ గుట్టు రట్టైంది. నలుగురు హవాలా వ్యాపారులను టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 90.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగానే ఈ దందా వెలుగులోకొచ్చింది. నిందితులు బస్సుల్లో నగదును తరలిస్తున్నట్లు పోలీసులుగుర్తించారు. పట్టుబడిన వ్యాపారులు డబ్బుకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు చూపలేదన్నారు. స్వాధీనం చేసుకున్న డబ్బు ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. గత ఎన్నికల్లో రూ.29 కోట్ల నగదు, రూ.3 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అక్రమ డబ్బు తరలింపులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details