గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భద్రత చర్యలు తీసుకొవాలన్నారు. రీపోలింగ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ద్వివేది అన్నారు.
నెల్లూరు జిల్లా అధికారులతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్ - video conference
నెల్లూరు జిల్లా కోవూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల పరిధిలోని 41, 197 పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 6న జరిగే రీపోలింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని ఈసీ గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలు జారీ చేశారు.
నెల్లూరు జిల్లా అధికారులతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్
రీపోలింగ్ ఏర్పాట్లపై నెల్లూరు జిల్లా అధికారులతో ద్వివేది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, జాయింట్ కలెక్టర్ వెట్రి సెల్విలు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో చేస్తున్న ఏర్పాట్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. రీ పోలింగ్ ప్రక్రియను వెబ్ క్యాస్టింగ్ చేయాలని సూచించారు.
ఇవీ చూడండి :పోలింగ్ సరళిపై.. రేపటి నుంచి తెదేపా సమీక్షలు