పసుపు-కుంకుమ 3వ విడత నిధుల విడుదలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నిధుల విడుదలకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. పసుపు కుంకుమ పథకానికి ముందుగానే నిధులు కేటాయించడం వలన ఎటువంటి అభ్యంతరం లేదని ఈసీ స్పష్టం చేసింది. నిధుల కేటాయింపునకు ఎన్నికల నిబంధనలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేది తెలిపారు. కానీ పసుపు-కుంకుమ పంపిణీ కార్యక్రమాలలో రాజకీయ పార్టీల నేతలు ఎవరు పాల్గొనకూడదని ద్వివేది అన్నారు. మూడో విడత కేటాయింపులలో నూతన లబ్దిదారులను చేర్చకూడదని నిబంధనలు విధించింది.
పసుపు-కుంకుమ మూడో విడతకు ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈసీ
రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడత నిధుల విడుదలకు ఎటువంటి అభ్యంతరం లేదని ఈసీ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఈ నిధులను ముందుగానే కేటాయించడం వలన...వీటి పంపిణీ ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు రాదని తేల్చిచెప్పింది.
పసుపు-కుంకుమ మూడో విడతకు ఈసీ గ్రీన్ సిగ్నల్