గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గ ఈవీఎం లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూం సీసీ దృశ్యాలు ప్రసారం మంగళవారం రాత్రి నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న అభ్యర్థులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సీసీ కెమెరాలకు సంబంధించిన అధికారులకు సమాచారమిచ్చారు. కానీ స్పందించలేదు. వెంటనే డీఎస్పీ కి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు సీసీ కెమెరాలు పునరుద్ధరించారు. సుమారు గంటపాటు ప్రసారాలు నిలిచిపోగా... నియోజకవర్గ అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. దృశ్యాలను ప్రసార కేంద్రంలో అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు.
ప్రత్యక్ష ప్రసార పర్యవేక్షణాధికారిని నియమించండి
గుంటూరులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో.. మంగళవారం రాత్రి గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజవర్గ స్ట్రాంగ్ రూంలోని సీసీ కెమెరాల ఫుటేజీ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న అభ్యర్థులు హుటాహుటిన అక్కడికి చేరుకుని... కలెక్టరేట్‌కు సమాచారమిచ్చిన అనంతరం అధికారులు కెమెరాల ప్రసారాన్ని పునరుద్ధరించారు.
ప్రత్యక్ష ప్రసార పర్యవేక్షణాధికారిని