వాళ్ల భర్తలు వ్యవసాయం చేస్తూ అప్పులు కట్టలేక తనువు చాలించారు. చివరి వరకు తోడుంటానని మధ్యలోనే కన్నుమూసినా... లోకం కాకుల్లా దెప్పిపొడుస్తున్నా మొక్కవోని ధైర్యంతో నేలతల్లిని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలోని తరూర్ మండలం మహిళా రైతులు. వీరి కన్నీటి వ్యథలపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు.
ధీర వనితలు... పుడమి కాంతులు
కష్టాలు వచ్చినా.. వాళ్లు కాడిని వదలలేదు. నేలతల్లిని నమ్ముకుని వ్యవసాయమే చేస్తున్నారు ఈ ధీర వనితలు. కట్టుకున్నవాడు కన్నుమూసినా మొక్కవోని ధైర్యంతో భూమాత రుణం తీర్చుకుంటున్నారు. ఆత్మహత్యలే పరిష్కారం కాదు బతకడంలోనే జీవితం ఉందంటున్నారు తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలోని తరూర్ మహిళా రైతులు.
ధీర వనితలు... పుడమి కాంతులు