న్యాయం కోసం భర్త ఇంటి ముందు ధర్నా - kanchikacherla
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో పరిటాల గ్రామానికి చెందిన కర్రల రాంబాబు, స్రవంతిలకు వివాహమై నాలుగు సంవత్సరాలైంది. భర్త , అత్త మామలు తనను వేధిస్తున్నారని భర్త ఇంటి వద్ద నిన్న సాయంత్రం నుంచి స్రవంతి ధర్నాకు దిగింది.
కృష్ణా జిల్లాలో ఓ వివాహిత.. భర్త ఇంటిముందే ఆందోళనకు దిగింది. అదనపు కట్నం కోసం హింసిస్తున్నారని ఆరోపిస్తూ ధర్నా చేసింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన రాంబాబుతో స్రవంతికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన మూడునెలలకే భార్య భర్తల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం భర్త కర్ర రాంబాబు తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని భార్య స్రవంతి ఆరోపించింది. ఇదే విషయమై పోలీసులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా.. వారి సమక్షంలో కౌన్సెలింగ్ జరిగినా భర్త మాత్రం తన వైఖరిని మార్చుకోలేదని చెప్పింది. ఇంటికి తాళం వేసి లోనికి రాకుండా అడ్డుకుంటున్నారని ఆందోళన కొనసాగించింది.