ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

శ్రీకాకుళం జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తా: మంత్రి ధర్మాన

మంత్రి హోదాలో తొలిసారిగా సొంత జిల్లా శ్రీకాకుళంకు వచ్చిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్​కు వైకాపా నేతలు ఘనస్వాగతం పలికారు. సొంత నియోజకవర్గం నరసన్నపేట వరకూ మంత్రి ర్యాలీగా వెళ్లారు.

శ్రీకాకుళం జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తా : మంత్రి ధర్మాన కృష్ణదాస్

By

Published : Jun 19, 2019, 11:53 PM IST


శ్రీకాకుళం జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తానని రహదారులు, భవనాల శాఖ మాత్యులు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. మంత్రిగా బాధ్యతులు చేపట్టిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చిన ఆయనకు వైకాపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఆముదాలవలస నుంచి నరసన్నపేట వరకూ మంత్రి ర్యాలీగా వెళ్లారు. నరసన్నపేట వైకాపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన మంత్రి కృష్ణదాస్... జిల్లా అభివృద్ధికి అన్ని పార్టీలు కలిసిరావాలని కోరారు. జిల్లాలో వంశధార, ఇతర జలాశయాలను పూర్తి చేసుకుని నీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

శ్రీకాకుళం జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తా : మంత్రి ధర్మాన కృష్ణదాస్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details