ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

బెదిరింపులకు భయపడం: దేవినేని అవినాశ్

వార్డు మెంబరుగా గెలవని నలుగురు ఎంపీలు చంద్రబాబు దయాదాక్షిణ్యాలపై గెలిచారని తెదేపా నేత దేవినేని అవినాశ్ అభిప్రాయపడ్డారు. భాజపా, వైకాపా బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. అవినీతి సొమ్ము కాపాడుకునేందుకే పార్టీ మారారని ఆయన ఆరోపించారు.

By

Published : Jun 21, 2019, 8:16 PM IST

Updated : Jun 21, 2019, 8:39 PM IST

బెదిరింపులకు భయపడం : తెదేపా నేత దేవినేని అవినాశ్


ప్రజాక్షేత్రంలో వార్డు మెంబరుగా గెలవని నలుగురు రాజ్యసభ్యులు...చంద్రబాబు దయదాక్షిణ్యాలపై ఎంపీలయ్యారని తెదేపా నేత దేవినేని అవినాశ్ అన్నారు. ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు, బుద్ధా వెంకన్నలపై మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని అన్నారు. వాళ్ల సొంత వ్యాపారాల కోసమే ఎంపీలు పార్టీ మారారన్నారు. పార్టీని రక్షించుకునేందుకు రక్షణ గోడగా ఉంటామన్నారు. చంద్రబాబు వేసిన బాటలో పార్టీని తిరిగి ఎలా నిలబెట్టుకోవాలో తెలుసని అభిప్రాయపడ్డారు. తెదేపా కార్యకర్తలపై దాడులు జరిగితే తెదేపా బలమెంటో చూపిస్తామన్నారు. భాజపా దాడులకు భయపడి ఆ పార్టీలోకి వెళ్లారని అవినాశ్ విమర్శించారు. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికే నలుగురు ఎంపీలు పార్టీ మారారని ఆరోపించారు. కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. తెలుగుదేశం పార్టీ, అధినేత చంద్రబాబు ఓ రక్షణ గోడలా ఉంటామని దేవినేని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత పోలీసులపై ఉందని గుర్తుచేశారు. తెదేపా కార్యకర్తలను ఊళ్ల నుంచి బహిష్కరిస్తున్న ఘటనలను ఆపాలని డిమాండ్ చేశారు. వైకాపా దాడులను బలంగా ఎదుర్కొంటామన్నారు.

బెదిరింపులకు భయపడం: దేవినేని అవినాశ్
Last Updated : Jun 21, 2019, 8:39 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details