ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

దేశం దాటినా... అమ్మాయికి దక్కని ప్రేమ

ఒమన్​ అమ్మాయి.. హైదరాబాద్​ అబ్బాయి ప్రేమ కోసం దేశం దాటి వచ్చింది. అయినా వారి ప్రేమ ఫలించలేదు. ఆమె మైనర్​ కావడం వల్ల పోలీసులు ఇంటికి పంపించారు.

love

By

Published : Apr 18, 2019, 12:22 PM IST

దేశం దాటినా... అమ్మాయికి దక్కని ప్రేమ

హైదరాబాద్​ అబ్బాయి వెంట వెళ్లిన ఒమన్ దేశ అమ్మాయి అదృశ్యం కేసును ఫలకనుమ పోలీసులు ఛేదించారు. అమ్మాయి మైనర్​ కావడం వల్ల తీసుకెళ్లిన అబ్బాయిని అపహరణ కేసు కింద అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

అసలేం జరిగిందంటే...

ఈనెల 12న రూబినా కూతురు ఇంట్లో ఎవరు లేని సమయంలో అతిఖ్​ అనే అబ్బాయితో వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న రూబినా పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రెండు బృందాలు ఏర్పాటు చేసి హైదరాబాద్​, బెంగళూరులో గాలింపు చేపట్టారు.

ఇవాళ తెల్లవారు జామున పటాన్​ చెరు ప్రాంతంలో మైనర్​ అమ్మాయి అతిఖ్​ వాళ్ల మామయ్య ఇంట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు.

అమ్మాయిని విచారించగా... గత మూడు సంవత్సరాల నుంచి అతిఖ్​ను ప్రేమిస్తున్నట్లు తెలిపింది. ఇష్టపూర్వకంగానే తనతో వెళ్లినట్లు అమ్మాయి స్పష్టం చేసింది. న్యాయమూర్తి ఆదేశాల మేరకు అమ్మాయి మైనర్​ కావడం వల్ల ఇంటికి తరలించారు. అతిఖ్​పై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: ఏటీఎంకెళ్తున్నారా... స్కిమ్మింగ్​లతో జాగ్రత్త

ABOUT THE AUTHOR

...view details