ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'కిలోమీటరు పరిధి వరకు నాలుగంచెల భద్రతా' - resullts

విజయవాడలోని ధనేకులు ఇంజినీరింగ్​ కౌంటింగ్​ కేంద్రం వద్ద పటిష్ఠ బందోబస్తు చేపట్టామని..సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. లెక్కింపు కేంద్రానికి కిలోమీటరు పరిధిలో నాలుగంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. అదనపు సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

'కిలోమీటరు వరకు నాలుగంచెల భద్రతా'

By

Published : May 22, 2019, 2:54 PM IST

"అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టాం"


' స్ట్రాంగ్​ రూమ్​ల వద్ద సీఆర్పీఎఫ్​ బలగాలతో పహారా కాస్తాం. ఆ తర్వాత అంచెలంచెలుగా ఏపీఎస్పీ, సివిల్​, ఏఆర్​ పోలీసు బృందాలతో భద్రతా ఏర్పాటు చేశాం. కిలోమీటరు పరిధిలో సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థ పనిచేస్తోంది. వాటిని కంట్రోల్​ రూమ్​కు అనుసంధానించి..పర్యవేక్షిస్తాం. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు పికెటింగ్​ ఉంటుంది. పాసులు ఉన్నవాళ్లనే లోపలికి వెళ్లనిస్తాం. రిటర్నింగ్​ అధికారి ఆదేశాల మేరకే పోలీసులూ.. లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. పార్కింగ్​ కోసం 12 ప్రదేశాలను సిద్ధం చేశాం. విజయోత్సవర్యాలీలకు 24 తేది తర్వాత షరతులతో కూడిన అనుమతిలిస్తాం. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్​ ఉంటుంది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.'
--- ద్వారకా తిరుమలరావు, విజయవాడ పోలీస్​ కమిషనర్​.

ABOUT THE AUTHOR

...view details