ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

దేశాన్ని కాపాడాలి : జైట్లీ

భారత అత్యునత సంస్థల పట్ల కాంగ్రెస్​ దుష్ప్రచారం చేస్తోందని భాజపా నేత అరుణ్​ జైట్లీ ఆరోపించారు.

జైట్లీ

By

Published : Feb 10, 2019, 10:51 PM IST

Updated : Feb 11, 2019, 6:45 AM IST

భారత అత్యునత సంస్థల పట్ల కాంగ్రెస్​ దుష్ప్రచారం చేస్తోందని భాజపా నేత అరుణ్​ జైట్లీ ఆరోపించారు. హస్తం నుంచి దేశంతో పాటు మన సంస్థలను కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.

గతంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఆర్బీఐ, న్యాయశాఖ సహా కేంద్ర దర్యాప్తు సంస్థ కార్యకలపాల్లో కలుగజేసుకుని ఏవిధంగా అటంకం కలిగించారో దేశ ప్రజానీకానికి తెలుసునని పేర్కొంటూ ఫేస్​బుక్​లో ఓ పోస్ట్​ చేశారు జైట్లీ.

శస్త్రచికిత్స అనంతరం శనివారం రాత్రి అమెరికా నుండి తిరిగొచ్చారు జైట్లీ. "గడిచిన రెండు నెలల కాలంలో కాంగ్రెస్​ అసత్య ప్రచారాలు చేసింది. అయితే అబద్ధాలకు దీర్ఘావుయు లేదు. వీటిని దేశ ప్రజానీకం నమ్మలేదు." అని సంస్థలపై దాడులు- తాజా కల్పనలు అన్న పేరుతో ఉన్న ఫేస్​బుక్​ పేజ్​లో పోస్ట్​ చేశారు.

పశ్చిమ బంగలో ప్రజాసామ్యం ప్రమాదంలో ఉందని జైట్లీ దుయ్యబట్టారు. రాష్ట్రంలో భాజపా కార్యకర్తలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

భాజపా సమావేశాలకు, రథయాత్రలకు అటంకాలు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్​ దుశ్చర్యలకు అంతులేకుండా పోయిందని కేరళలో కెమెరాల ముందే గోవులను వధిస్తూ, మధ్యప్రదేశ్​లో మాత్రం గో హంతకులను అరెస్టు చేయాలని ధర్నాలు చేస్తున్నారని జైట్లీ ఆరోపించారు.

ప్రభుత్వాన్ని స్వేచ్ఛగా విమర్శిస్తూనే భావప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని కాంగ్రెస్​ మొసలి కన్నీరు కారుస్తోందని జైట్లీ ఎద్దేవా చేశారు.

ఇటీవల జరిగిన ఛత్తీస్​గఢ్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​,మావోయిస్టులతో పొత్తు కుదుర్చుకున్నారని, జవహర్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయంలో తుకెడె-తుకెడె గ్యాంగ్​తో భుజాలు,భుజాలు రాసుకున్నారని జైట్లీ తీవ్ర విమర్శలు చేశారు.

పార్లమెంట్​ సమావేశాలకు రాహుల్​ అటంకం కలిగిస్తున్నారని, రఫేల్​పై ఆయన చేసిన రెండు ప్రసంగాల్లో ప్రధానమంత్రి పై ద్వేషం,అసూయ స్పష్టంగా కనిపించిందని జైట్లీ అన్నారు.

దేశ వాయుసేనను బలోపేతం చేయడానికే రఫేల్​ యద్ధ విమానాలు కొనుగోలు చేస్తున్నామని, దీనినీ హస్తం పార్టీ రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు.

2008-2014 మధ్య కాలంలో దేశ బ్యాంకింగ్​ వ్యవస్థను నాశనం చేసిందని జైట్లీ అన్నారు. ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ యంత్రాల్లో ఎటువంటి లోపాలు లేవని ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల సంఘంపై కాంగ్రెస్​ ఆరోపణలు చేస్తోందని జైట్లీ విమర్శించారు.

ఆర్బీఐ, సీబీఐ సహా వివిధ సంస్థల కార్యకలపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లేదని జైట్లీ స్పష్టం చేశారు.

Last Updated : Feb 11, 2019, 6:45 AM IST

ABOUT THE AUTHOR

...view details