ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'అమ్మ'లందరికీ శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

"కనిపించే ప్రత్యక్ష దైవం కన్నతల్లి. వారిపై ప్రేమాభిమానాలు చూపించాలి. పిల్లలకు పాఠశాల దశ నుంచే తల్లిదండ్రులను గౌరవించే సంస్కారం నేర్పించాలి. అమ్మకు మాత్రమే కేటాయించిన ఈ ప్రత్యేకమైన రోజున తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు". --సీఎం చంద్రబాబు నాయుడు

చంద్రబాబునాయుడు

By

Published : May 12, 2019, 8:38 AM IST

రాష్ట్రంలోని మాృతమూర్తులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు 'మాతృ దినోత్సవ శుభాకాంక్షలు' తెలిపారు. అమ్మ ఒడి తొలిబడి, బిడ్డలకు తొలిగురువు అమ్మ అని ఉద్ఘాటించారు. సంస్కారమే అమ్మకిచ్చే గౌరవమని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులు గురువు పాత్ర పోషిస్తారనీ.. శిశువుకు ఆదిగురువు అమ్మేననీ.. శిశువు బుద్ధి వికసించేది తల్లి ఒడిలోనే అని తెలిపారు. విద్యార్థి దశలోనే తల్లిపై ప్రేమను పెంచాలని సూచించారు. తల్లిదండ్రులను గౌరవించే సంస్కారం నేర్పాలనీ... అందుకే గతేడాది తాము 'అమ్మకు వందనం' కార్యక్రమం ప్రవేశపెట్టామని వివరించారు. తల్లిదండ్రులు తమ బిడ్డలను పెంచి పెద్ద చేయడమే కాకుండా ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారనీ.. అయితే కొంతమంది పిల్లలు ఎదిగిన తర్వాత అమ్మానాన్నల్ని ఆశ్రమపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనిపించే ప్రత్యక్ష దైవం తల్లి అని ఉద్ఘాటించారు. తమ బిడ్డలను పాఠశాలలకు పంపించే పేద మహిళలకు ప్రోత్సాహక పారితోషికం ఇస్తామని స్పష్టంచేశారు.

ABOUT THE AUTHOR

...view details