ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఎంపీ సీఎం రమేష్ నివాసంలో పోలీసుల సోదాలు - police

కడప జిల్లా.. తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్‌ నివాసంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని రమేశ్‌ ఇంటికి తెల్లవారుజామున ఆరుగంటలకే.. వచ్చిన పోలీసులు విస్తృతంగా గాలించారు. గంటపాటు ఇంట్లో అణువణువూ వెతికారు.

cm ramesh

By

Published : Apr 5, 2019, 9:19 AM IST

Updated : Apr 5, 2019, 9:35 AM IST

కడప జిల్లా..తెలుగుదేశం ఎంపీ సీఎంరమేష్‌ నివాసంలో పోలీసులు తనిఖీలు చేశారు.ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని రమేశ్‌ ఇంటికి తెల్లవారుజామున ఆరుగంటలకే..వచ్చిన పోలీసులువిస్తృతంగా గాలించారు.గంటపాటు ఇంట్లో అణువణువూ వెతికారు. ఏమీ దొరక్కపోవడంతో వెనుదిరిగారు.గ్రామంలోని సీఎం రమేశ్‌ అనుచురుల ఇళ్లలోనూ పోలీసులుతనిఖీలు చేస్తున్నారు.సోదాలపై సీఎం రమేశ్‌ మండిపడ్డారు.సెర్చ్ వారెంట్ కూడా లేకుండా..సోదాలు చేశారని ఆగ్రం వ్యక్తంచేశారు. కేంద్రం ఆదేశాల మేరకే తనిఖీలు చేశారని అనుమానం వ్యక్తంచేశారు. న్యాయం, ధర్మం తమ వైపు ఉన్నతకాలం తాము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.ఎన్ని రకాలుగా బెదిరించినా బెదరడానికి ఎవరూ సిద్ధంగా లేరని..సీఎం రమేశ్‌...తేల్చిచెప్పారు.

ఎంపీ సీఎం రమేష్ నివాసంలో పోలీసుల సోదాలు
Last Updated : Apr 5, 2019, 9:35 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details