''వైఎస్ వివేకా హత్యపై అనేక అబద్ధాలు చెప్పారు. గుండెపోటుతో చనిపోయారని నమ్మించే ప్రయత్నం చేశారు. గుండెపోటు వస్తే ఎవరికైనా తలనుంచి రక్తం వస్తుందా?'' - చంద్రబాబు, ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబు
By
Published : Mar 16, 2019, 4:58 PM IST
తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు
వైఎస్ వివేకా హత్యపై అనేక అబద్ధాలు ప్రచారం చేశారని ముఖ్యమంత్రిచంద్రబాబు ఆరోపించారు.మొదట గుండెపోటుతో చనిపోయారని నమ్మించే ప్రయత్నం చేశారని...గుండెపోటు వస్తే ఎవరికైనా తలనుంచి రక్తం వస్తుందా?అని తిరుపతిలో నిర్వహించిన తెదేపా విజయ శంఖారవ సభలో ప్రశ్నించారు.వైఎస్ వివేకా తలకు కట్లు కట్టారు..రక్తం కడిగేశారని అన్నారు.హత్య జరిగాక రక్తం మరకలు ఎందుకు కడిగారని ప్రశ్నించారు.గుండెపోటు కాదు..హత్య జరిగిందని శవపరీక్ష నివేదిక స్పష్టం చేసిందని తెలిపారు.అక్కణ్నుంచి వైకాపా నేతలు తమపై బురద జల్లారని మండిపడ్డారు.చిన్నాన్న అనే మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించారని అన్నారు.దోషులను కాపాడేందుకు అనేక నాటకాలు ఆడారని చెప్పారు.చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని...కేంద్రంలో మోదీ ఉన్నారనే సీబీఐ దర్యాప్తు అడుగుతున్నారని ఆరోపించారు.వివేకానందరెడ్డిని ఎవరు చంపారో రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయాలని అన్నారు.సాయంత్రానికి వివేకా రాసినట్లు ఓ లేఖ తీసుకొచ్చారని...పులివెందుల రాజకీయం ఎక్కడా ఉండదని విమర్శించారు.ప్రతిపక్షంలో ఉంటేనే ఇలా ప్రవర్తిస్తున్న ఇలాంటి వాళ్లకు10సీట్లు వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.