ఈయన అన్ని అర్హతలూ ఉన్నా.. ఉద్యోగం దక్కని ఓ సగటు నిరుద్యోగి ! పైగా దివ్యాంగుడు..! తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం కొండయ్యపేటకు చెందిన గణేశ్..2013లో డిప్లొమా ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేశాడు. ఫలితాలొచ్చిన ఆనందంలోఇంటికెళ్తుండగా లారీ ప్రమాదంలో గాయపడ్డాడు. వైద్యులు మోకాలు వరకూ తొలగించారు. 2019లో వార్డు వాలంటీరుగా ఎంపికైనా.. శరీరం సహకరించకపోవడంతో మధ్యలోనే విధుల నుంచి తప్పుకున్నాడు.
రెండేళ్లయినా నెరవేరని సీఎం హామీ
తర్వాత ల్యాబ్ టెక్నీషియన్‌గా అవకాశం కల్పించాలంటూ గణేశ్ ఎన్నోసార్లు అధికారుల్ని వేడుకున్నాడు. 2019 అక్టోబరులో కరపలో బహిరంగసభకు వచ్చిన సీఎం జగన్‌కూ మొర పెట్టుకున్నాడు. స్పందించిన సీఎం.. ఉద్యోగం ఇవ్వాలంటూ అప్పటి కలెక్టర్ మురళీధర్‌రెడ్డిని ఆదేశించారు. గతేడాది కొవిడ్ సమయంలో కాకినాడ జీజీహెచ్‌లో సేవల్ని వినియోగించుకున్నా.. తర్వాత విధుల నుంచి తొలగించారు. సీఎం హామీ ఇచ్చి రెండేళ్లయినా ఇప్పటికీ అమలు కాలేదని వాపోయాడు గణేశ్.