కౌంటింగ్‌కు ప్రత్యేక బృందాలు
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కౌంటింగ్‌కు ప్రత్యేక బృందాలు ఏర్పడాలన్న సీఎం... కౌంటింగ్ అనుభవం ఉన్నవారిని అందుకు సన్నద్ధం చేయాలన్నారు. ఈ బృందాల్లో అడ్వకేట్, ఐటీ నిపుణుడు ఉండేలా చూడాలని చంద్రబాబు సూచించారు. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ ప్రక్రియపై వర్క్ షాప్‌లు నిర్వహించాలని ఆదేశించారు. కౌంటింగ్‌కు సంబంధించి టీడీ జనార్దన్, సాయిబాబు తదితరులతో కూడిన రాష్ట్రస్థాయి కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు.
ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉందన్న చంద్రబాబు.. అన్ని వర్గాల ప్రజలు తెదేపా పక్షం నిలిచారన్నారు. కీలక ఘట్టమైన కౌంటింగ్‌కు పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సీఎం అన్నారు. కుటుంబమైనా, పార్టీ అయినా జవాబుదారీతనంగా ఉండాలన్న ముఖ్యమంత్రి... జవాబుదారీతనంతోనే బాధ్యత, హక్కులు ఉంటాయన్నారు. బూత్‌ల వారీగా పార్టీల బలాబలాలపై అవగాహన పెరగాలని సీఎం అన్నారు. గత ఎన్నికల ఓటింగ్ సరళిని విశ్లేషించి..బూత్ వారీగా పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో అంచనా వేయాలని కోరారు.
ఓడిపోతామన్న సీట్లలోనూ ఆధిక్యత వచ్చే అవకాశాలున్నాయన్న చంద్రబాబు...భవిష్యత్తు రాజకీయాలకు వీటిని కేస్ స్టడీగా అధ్యయనం చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు చివరి వరకు ఉండాలని.. ఎవరూ మధ్యలో వెళ్లిపోకూడదని ఆదేశించారు. ప్రతీ నియోజకవర్గాన్ని కీలకంగా తీసుకోవాలని.. ఒక్క సీటులో ఓడినా అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. ప్రతీ స్థాయిలో మెరుగైన ప్రదర్శన చూపాలని చంద్రబాబు కోరారు.
వైకాపా దాడులు