చంద్రగిరి రాగానే చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయని చదువుకునే రోజుల్ని సీఎం తలుచుకున్నారు.1978లో చంద్రగిరిలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశానన్న సీఎం.. తెదేపా ఐదేళ్ల పాలనలో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని తెలిపారు.జగన్ పెద్ద రౌడీ అయితే చెవిరెడ్డి చిన్న రౌడీ అని పేర్కొన్న సీఎం..చెవిరెడ్డి లాంటి వారిని ఓడించి ఇంటికి పంపించాలని సూచించారు.మహిళలకు అండగా ఉండే ఏకైక పార్టీ తెదేపా అని స్పష్టం చేసిన చంద్రబాబు..రెండు పండగలకు రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా చంద్రన్నే కులం, తెదేపానే మతంగా ప్రజలు భావిస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఇంటర్ నుంచే నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించారు.నన్ను చూస్తే పారిశ్రామికవేత్తలు వస్తారు, జగన్‌ను చూస్తే పారిపోతారని తెలిపిన సీఎం..వైకాపా నేతలకు దిల్లీలో కాపలాదారు మోదీ అన్నారు. గాంధీ పుట్టిన గుజరాత్‌లోనే పుట్టినా..మోదీ సత్యాలు చెప్పరని ఎద్దేవా చేశారు. చంద్రగిరిలోని ప్రతి ఎకరానికీ నీరిచ్చే బాధ్యత నాదని సీఎం భరోసా ఇచ్చారు.
పులివెందుల్లో జగన్ పై వ్యతిరేకత...