తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వగ్రామమైన కుప్పంలో పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో ఆయన పాల్గొన్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బెంగళూరు నుంచి హెలికాఫ్టర్లో కుప్పం చేరుకున్న చంద్రబాబు... సతీసమేతంగా ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకుని... అనంతరం గంగమ్మ ముత్తు మారెమ్మ ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.
కుప్పంలో గంగమ్మ తల్లిని దర్శించుకున్న చంద్రబాబు - కుప్పం
కుప్పంలో గంగమ్మ తల్లిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి వచ్చిన చంద్రబాబుకు అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కుప్పం గంగమ్మ తల్లిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు