స్వలాభ రాజకీయాల కోసం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సమస్యలు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు.పిరికిపంద రాజకీయాలు చేస్తున్నారనిఎద్దేవా చేశారు.కేసీఆర్,కేటీఆర్‌కు బానిసగా ఉన్నారని విమర్శించారు.60ఏళ్లు కష్టపడిన సంపాదించుకున్నఆస్తులు లాగేసుకున్నారని... ఇప్పుడు నిర్మించుకుంటున్న నవ్యాంధ్ర ఆస్తులు లాగేందుకు జగన్ రూపంలోకుట్ర పన్నారని తెలిపారు.
'కేసీఆర్, కేటీఆర్‌కు వైకాపా అధినేత బానిస' - CM CHANDRABABU
కేసీఆర్‌తో కలిసి రాష్ట్రం జగన్ కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. కేసీఆర్, కేటీఆర్‌కి భయపడుతూ జగన్ భయపడుతూ వారివద్ద బానిసాలా ఉన్నారని అన్నారు.
హైదరాబాద్‌కుపూర్వ వైభవం రావాలంటే ఏపీలో అసమర్థ ప్రభుత్వం ఉండాలనికేసీఆర్ భావిస్తున్నారని సీఎం అభిప్రాయపడ్డారు.ఆంధ్రప్రదేశ్‌లో పుట్టడమే నేరమా అని హైదరాబాద్‌లో ఉండేవాళ్లు భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.జగన్ ముమ్మాటికీ తుపాను కంటే పెద్ద సమస్యేనని అభివర్ణించారు.తుఫాను కొన్ని ప్రాంతాలపైనే ప్రభావం చూపుతుంది.జగన్ ప్రతి అభివృద్ధి పనికి అడ్డం పడతారని సీఎం మండిపడ్డారు.
3కోట్ల91లక్షల ఓటర్లలో98లక్షల మందికి పసుపు కుంకుమ ఇచ్చామని సీఎం స్పష్టం చేశారు.మహిళలంతా ఏకపక్షంగా తెలుగుదేశానికి ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 65లక్షల మందికి పింఛన్లు,నిరుద్యోగ భృతి ఇస్తున్నామన్న సీఎం... 45లక్షల మంది రైతులకు అన్నదాతసుఖీభవ వర్తిస్తోందని తెలిపారు.ఇంకా అనేక వర్గాలకు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చామన్నారు.అభివృద్ధి చూసి ఓర్వలేకనే జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.