ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

16వేల ఇళ్లకు వెయ్యి కోట్ల బకాయిలు రద్దు : సీఎం - cm_at_jakkampudi

విజయవాడ జక్కంపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 16వేల ఇళ్లకు వెయ్యి కోట్ల బకాయిలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఆడపడుచులందరికీ పెద్దన్నలా అండగా ఉంటానని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు

By

Published : Mar 29, 2019, 7:50 AM IST

జక్కంపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారం
16 వేల ఇళ్లకు వెయ్యి కోట్ల బకాయిలు రద్దు చేస్తామని...బకాయిలు ఎవరూ కట్టక్కర్లేదని విజయవాడ జక్కంపూడిలో తెలుగుదేశం అధినేతచంద్రబాబు తెలిపారు.బకాయిలన్నీ రద్దు చేసి ఉచితంగా ఇల్లు ఇస్తానని స్పష్టం చేశారు.అన్నదాత సుఖీభవ మొత్తం నిధులు... ఎన్నికలకు ముందే రైతుల ఖాతాలో జమవుతుందని తెలిపారు.పసుపు కుంకుమ ఎన్ని సార్లైనా ఆడపడుచులకు ఇస్తానని చెప్పారు.చంద్రన్న పెళ్లి కానుక మొత్తాన్ని35వేల రూపాయల నుంచి లక్షకు పెంచనున్నట్లు పేర్కొన్నారు.ఆడపిల్లల పెళ్లి చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.రైతు,యువత,చెల్లెమ్మలందరి భవిష్యత్తు మెరుగు చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.జగన్ లాంటి వ్యక్తి వస్తే అంతా జైలుకు పోతారని..దొంగ లెక్కలు రాసి అడ్డంగా దొరికిపోవటంలో జగన్ నేర్పరి అని మండిపడ్డారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details