ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

చంద్రగిరిలోని 5 కేంద్రాల్లో 19న రీ పోలింగ్

తెదేపా ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. చంద్రగిరి నియోజకవర్గంలోని 5 కేంద్రాలలో రీపోలింగ్​కు ఈసీఐ ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 19న ఈ 5 కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈసీఐ ఉత్తర్వులు ఇచ్చింది.

చంద్రగిరిలోని 5 కేంద్రాలలో రీపోలింగ్​కు ఈసీఐ ఆదేశాలు

By

Published : May 15, 2019, 7:31 PM IST

Updated : May 15, 2019, 9:49 PM IST

చంద్రగిరిలోని 5 కేంద్రాల్లో 19న రీ పోలింగ్

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 5 కేంద్రాల్లో రీపోలింగ్‌ జరిపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్‌.ఆర్‌.కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్తకండ్రిగ, వెంకట్రామపురంలో.... ఈ నెల 19న రీపోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం రాసిన లేఖపై స్పందించిన ఈసీఐ.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ జరిగే ఈ నెల 19న.... ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.... 5 కేంద్రాల్లో అసెంబ్లీ, లోక్​సభ స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు.

చంద్రగిరిలోని రెండు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని మంత్రి కళావెంకట్రావు నేతృత్వంలోని బృందం... రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈసీఐకు నివేదిక పంపింది. తెదేపా ఫిర్యాదుకు బదులుగా చంద్రగిరిలో మొత్తం 5 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలు జారీచేసింది.

Last Updated : May 15, 2019, 9:49 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details