తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 28న గుంటూరులో పర్యటించనున్నారు. గుంటూరు తెదేపా రాష్ట్ర కార్యాలయంలో జరిగే ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొంటారు. కార్యాలయ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పించిన తర్వాత... పార్టీ నేతలతో సమావేశమవుతారు. ప్రతీ ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఎన్నికల ఫలితాలకు ముందే మహానాడు నిర్వహణపై చర్చించిన తెదేపా.. మహానాడు నిర్వహణకు సమయం సరిపోనందున వాయిదా వేయాలని నిర్ణయించారు. కానీ, మహానాడుతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ జయంతి వేడుకలను 28న యథావిధిగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు.
ఈ నెల 28న చంద్రబాబు గుంటూరు పర్యటన - ఎన్టీఆర్
ఈ నెల 28న గుంటూరులో చంద్రబాబు పర్యటించనున్నారు. తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం పార్టీ నేతల సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
చంద్రబాబు గుంటూరు పర్యటన