పేదల సంక్షేమానికి తెదేపా సంఘీభావ యాత్రలు చేపట్టాలని పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పేదలపై వైకాపా కుట్రలకు నిరసనగా రోజూ గంటసేపు ర్యాలీలు చేయాలని సూచించారు. ప్రత్యర్థుల కదలికలపై నిఘా పెట్టాలనీ... దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి తెదేపా కార్యకర్త పోరాట యోధుడితో సమానమనితెలిసేలా చేయాలన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాష్ట్రాన్ని, పార్టీని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలను ప్రతిఒక్కరూ సవాల్‌గా తీసుకోవాలనీ... గెలుపే లక్ష్యంగా రాత్రీపగలు కష్టపడాలని సూచించారు.
నాయకులపై దాడులు భాజపా కుట్రే
ఆంధ్రుల సత్తా ఏంటో కేసీఆర్‌కు, మోదీకి తెలియజేయాలన్నారు. పుట్టా సుధాకర్‌కు మద్దతుగా కడప అంతా కదిలివచ్చిందనీ.. ఈ స్ఫూర్తి రాష్ట్రం మొత్తం కనిపించాలన్నారు. దుష్ట బుద్ధి జగన్‌కు తిరుగులేని గుణపాఠం చెప్పాలన్నారు. నిన్న పుట్టా సుధాకర్, మొన్న బీదా మస్తాన్‌రావుపై దాడులు భాజపా కుట్రలేనని ఆరోపించారు. బీసీ నాయకులే లక్ష్యంగా కేంద్రంలో భాజపా నేతల దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. బీసీలు రాజకీయాల్లో రాణించడంపై మోదీ కక్షసాధింపు చర్యలు చేపట్టారని ధ్వజమెత్తారు. ఓటమి భయంతోనే నరేంద్రమోదీ దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారని మండిపడ్డారు.
ఇవీ చదవండి..
వైకాపా దురాగతాలతో తరతరాల అభివృద్ధికి గండి'