ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఏకగ్రీవం - babu

తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికయ్యారు. అమరావతిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన టీడీఎల్పీ సమవేశంలో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, సుజనా చౌదరి, కనకమేడల రవీంద్రబాబు, సీఎం రమేష్‌, గరికపాటి మోహన్‌రావు తదితరులు హాజరయ్యారు.

cbn

By

Published : May 29, 2019, 1:20 PM IST

Updated : May 29, 2019, 2:43 PM IST

తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రజల కోపం వల్ల తాము ఓటమి పొందలేదని, జగన్‌ పట్ల ఉన్న సానుభూతే ఆ పార్టీని గెలిపించిందనే అభిప్రాయం శాసనసభాపక్ష సమావేశంలో వ్యక్తమైంది. తెలుగుదేశం ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటుందన్న చంద్రబాబు..నేతలెవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ది కోసం ఐదేళ్లు చిత్తశుద్ధితో పనిచేశామని..కాలంతో పరుగెత్తి అనేక పనులు చేశామని చంద్రబాబు గుర్తుచేశారు.

అభివృద్ధి, సంక్షేమంతో పాటు మౌళికవసతులకు పెద్దపీట వేశామన్నారు. రాజధాని నిర్మాణ పనులు వేగంగా చేపట్టామని... ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా అనేక పనులు చేశామన్నారు. కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో..కొంతకాలం వేచిచూద్దామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శాసన సభ గొప్ప వేదిక అన్న చంద్రబాబు..సభకు హాజరు కాకుండా గత ప్రతిపక్షం వ్యవహరించినట్లు చేయరాదని చెప్పారు. ప్రతి ప్రాంతంలో నాయకులంతా ప్రజలతో మమేకం కావాలని..ఎక్కడా పార్టీపైన, తెదేపా ప్రభుత్వంపైన వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. అన్నివర్గాల మద్దతు సాధించడమే లక్ష్యంగా పనిచేద్దామని నేతలకు చంద్రబాబు సూచించారు.

టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఏకగ్రీవం

ఇదీ చదవండీ: జగన్​ను కలవనున్న "కింజారపు, పయ్యావుల, గంటా"

Last Updated : May 29, 2019, 2:43 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details