రాష్ట్రవ్యాప్తంగా సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లు భారీగా పోలయ్యాయనీ.. వాటితో పోలిస్తే సర్వీస్ ఓట్లు తక్కువగా పోలయ్యాయని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. రేపు ఉదయం 7 లోపు నిర్దేశిత కౌంటింగ్ సెంటర్‌కు చేరే సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లు మాత్రమే లెక్కిస్తామని తెలిపారు.
మే 20 నాటికి జిల్లాల వారీగా పోలైన సర్వీసు ఓట్లు
శ్రీకాకుళం 8121
విజయనగరం 2564
విశాఖ 3333
తూర్పుగోదావరి 923
కృష్ణా 457
గుంటూరు 3036
ప్రకాశం 3765
నెల్లూరు 362
కడప 1175
కర్నూలు 1935
అనంతపురం 1676
చిత్తూరు 2185 .
25 లోక్‌సభ స్థానాల పరిధిలో పోలైన మొత్తం సర్వీసు ఓట్లు 28,662. 175 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన మొత్తం సర్వీసు ఓట్లు 29,532 అని సీఈవో తెలిపారు.
25 లోక్‌సభ స్థానాల్లో వచ్చిన ఫారం 12 దరఖాస్తులు 3,17,291
లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలో జారీచేసిన ఓట్లు 3,00,957
లోక్‌సభ స్థానాల పరిధిలో ఆర్వోలకు అందిన పోస్టల్ బ్యాలెట్లు 2,14,937
13 జిల్లాల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం 3,18,530 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. 3,05,040 మందికి పోస్టల్ బ్యాలెట్ మంజూరు చేశామని చెప్పారు. మే 20 నాటికి 2,11,623 పోస్టల్ బ్యాలెట్లు ఆర్వోలకు చేరాయని తెలిపారు.