ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

గుణదల వద్ద కారు బీభత్సం.. తప్పిన పెను ప్రమాదం - car accident

విజయవాడ గుణదల వైపు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే కూడలి వద్ద కారు ప్రమాదం జరిగింది. సీసీ కెమెరాలు అమర్చిన ఇనుప స్తంభాన్ని, దాని పక్కన ఉన్న కరెంటు స్తంభాలను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. స్తంభాలు ధ్వంసమై విద్యుత్​ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. కరెంటు తీగలు వేలాడుతున్నాయి.

గుణదల వద్ద సీసీ కెమెరా స్తంభాన్ని ఢీకొట్టిన కారు

By

Published : Jun 29, 2019, 12:21 PM IST

గుణదల వద్ద సీసీ కెమెరా స్తంభాన్ని ఢీకొట్టిన కారు

విజయవాడ గుణదల ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. గుణదల వైపు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళే కూడలి వద్ద వేగంగా వచ్చిన కారు సీసీ కెమెరాలు అమర్చిన ఇనుప స్తంభాన్ని, కరెంటు స్తంభాలను ఢీకొట్టింది. స్తంభాలు రెండు పూర్తిగా ధ్వంసమై.. కరెంటు తీగలు వేలాడుతున్నాయి. ఖరీదైన సిసి కెమెరాలు చిద్రమైనాయి. విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో పెద్దగా ట్రాఫిక్ లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది.

ABOUT THE AUTHOR

...view details