విశాఖలో మొట్టమొదటి సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ హెమటాలజీ మరియు హెమటో అంకాలజీ(బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్) యూనిట్‌ను మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి సారథ్యంలో... హాస్పిటల్ ఎండీ మురళీకృష్ణ ప్రారంభించారు. ఈ యూనిట్‌ను ఆరిలోవ హెల్త్ సిటీలోని యూనిక్ ఆసుపత్రి ఆవరణలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మురళీకృష్ణ తెలిపారు. ఇప్పటివరకూ ఇలాంటి సౌకర్యాలు మన రాష్ట్రంలో లేక.. ప్రజలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఇప్పుడు విశాఖలో ఈ యూనిట్ ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు. పెద్దలతోపాటు చిన్నపిల్లలకూ వచ్చే బ్లడ్ క్యాన్సర్ సమస్యలను పూర్తిగా నయం చేయొచ్చని వివరించారు.
విశాఖలో 'బోన్‌మారో'.. ఆంధ్రాలోనే తొలి యూనిట్ - క్యాన్సర్
క్యాన్సర్ పేషెంట్లకు శుభవార్త.. రాష్ట్రంలో తొలి బోన్‌మారో యూనిట్ విశాఖలో ప్రారంభమైంది. ఇన్నాళ్లు చికిత్స కోసం పక్క రాష్ట్రాలకు వెళుతున్న పేషెంట్లు ఇకనుంచి విశాఖలోనే బోన్‌మారో చేయించుకోవచ్చు.
క్యాన్సర్ పేషెంట్లకు శుభవార్త.. విశాఖలో 'బోన్‌మారో' యూనిట్