కాబోయే ముఖ్యమంత్రి జగన్ నివాసానికి అధికారులు క్యూకట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసానికి పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వచ్చి.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జగన్ను కలిసి అభినందనలు తెలిపిన వారిలో డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీగా పదవులు దక్కొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్న...విజిలెన్స్ డీజీ గౌతమ్ సవాంగ్, తెలంగాణ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉన్నారు.
కాబోయే సీఎంతో అధికారుల మర్యాదపూర్వక భేటీలు
జగన్ నివాసానికి అధికారుల తాకిడి ఎక్కువైంది. పలు జిల్లాల కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఎస్పీలు, సీనియర్ అధికారులు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చి...మర్యాదపూర్వకంగా భేటీ అవుతున్నారు.
జగన్ కలిసేందుకు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంయుక్త కలెక్టర్లు, ఇతర అధికారులు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వస్తున్నారు. జగన్తో విశాఖ, తూర్పుగోదావరి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు భేటీ అయ్యారు. వీరితో పాటు సీనియర్ అధికారులు కృష్ణబాబు, వరప్రసాద్, సంధ్యారాణి, లక్ష్మీకాంతం, సత్యనారాయణ, ఐజీ సంజయ్ ఉన్నారు. కలెక్టర్లు ప్రద్యుమ్న, కాటమనేని భాస్కర్, కార్తికేయ మిశ్రా, ఎస్పీలు రవిప్రకాశ్, మేరీ ప్రశాంతిలు జగన్ను మర్యాదపూర్యకంగా కలిశారు.
ఇవీ చూడండి : జగన్ మా స్నేహితుడు.. కలిసే చదువుకున్నాం!