ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మోదీపై అసత్యప్రచారాలు చేస్తున్నారు : భాజపా నేత దిలీప్ - bjp leader

కేంద్రం అన్నీ విధాల సాయపడుతున్నా రాష్ట్ర నేతలు కావాలనే అసత్యప్రచారాలు చేస్తున్నారని భాజపా నేతలు విమర్శించారు. కృష్ణా జిల్లా మైలవరంలో పర్యటించిన దిలీప్, బాల కోటేశ్వరరావు... మోదీని మరోసారి ప్రధానిని చేసేందుకు కమలం గుర్తుపై ఓటేయాలని కోరారు.

భాజపా నేతల ప్రచారం

By

Published : Mar 28, 2019, 7:09 PM IST

భాజపా నేతల ప్రచారం
రాష్ట్రంలో అభివృద్ధికి భాజపా కృషి చేస్తోందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. కృష్ణా జిల్లా చంద్రాల, మైలవరంలో భాజపా లోక్​సభ, శాసనసభ అభ్యర్థులు దిలీప్, బాల కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మాట్లాడిన నేతలు ఏపీ అభివృద్ధికి కేంద్రం అందించిన నిధులు అందిస్తుందన్నారు. కేంద్రం సాయపడుతున్న కొందరు నేతలు స్వలాభం కోసం మోదీపై అసత్యప్రచారాలు చేస్తున్నరని అన్నారు. ప్రజలు అన్నీ విషయాలు గమనిస్తున్నారన్న నేతలు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి సముచిత స్థానం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details