ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'ముఖ్యమంత్రి' సీటుపై.. 'హోంమంత్రి' పర్యవేక్షణ! - TELE

ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి... చిత్తూరు జిల్లా కుప్పం తెదేపా కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ చేశారు. కుప్పంలో చంద్రబాబును భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

BHUVANESWARI

By

Published : Apr 2, 2019, 12:51 PM IST

ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలో ఆయన సతీమణి భువనేశ్వరి తెదేపా కోసం శ్రమిస్తున్నారు. పార్టీఅధినేతగా వరుస ప్రచారాలతో తీరిక లేకుండా ఉన్న చంద్రబాబు బాధ్యతలను.. తనూ పంచుకుంటున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పర్యటిస్తుండగా.. ఆయన పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గ బాధ్యతలను భువనేశ్వరి చూసుకుంటున్నారు. నియోజకవర్గ తెదేపా నేతలతో ఆమె టెలీకాన్ఫరెన్స్ చేశారు. ఈ సారి లక్షా 20 వేల ఓట్లతో బాబు గెలిచేలా కార్యకర్తలు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. 2014 ఎన్నికల్లో కుప్పం నుంచి63 శాతం ఓట్లు తెదేపాకే పడ్డాయని గుర్తు చేసిన భువనేశ్వరి.. ఈ సారి 75 శాతం ఓట్లు సాధించేలా శ్రమించాలని చెప్పారు.కుప్పంలో పార్టీ పరంగా ఏ అవసరం ఉన్నా.. తనను సంప్రదించాలని తెలిపారు. ఈ ఎన్నికలను ఒక సవాలుగాతీసుకొని పని చేయాలన్నారు. కుప్పం పార్టీ శ్రేణులు, ప్రజలపై చంద్రబాబుకు ఉన్న అభిమానాన్ని నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నియోజకవర్గ పరిధిలోని నాయకులు,కార్యకర్తలపై ఉందని గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details