ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ ఇంటింటి ప్రచారం - అఖిల ప్రియ

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిల ప్రియ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో ఇంటింటికీ తిరుగుతూ ఉత్సహంగా ప్రచారం చేశారు. తెలుగింటి ఆడపడుచులకు పసుపు-కుంకుమ వంటి సంక్షేమపథకాలను అమలు చేస్తోన్న చంద్రన్న రుణం తీర్చుకునే సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు

ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ ఇంటింటి ప్రచారం

By

Published : Apr 4, 2019, 1:52 PM IST

ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ ఇంటింటి ప్రచారం
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని ఎస్.వి.నగర్​లో ఇంటింటికీ తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తన ప్రచారానికి మంచి స్పందన లభిస్తోందన్న ఆమె... ఈ ఎన్నికల్లో తన విజయం తథ్యమని అభిప్రాయపడ్డారు. తెదేపా కార్యకర్తలు ముందుండి తన ప్రచారం జోరుగా నడిపిస్తున్నారన్నారు. మళ్లీ తనదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రన్న సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తన విజయానికి కారణమవుతాయని మంత్రి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details