ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'తేల్చుకుందాం రండి'

తెలంగాణ ప్రభుత్వం ఐటీ కంపెనీల మీద దాడులు చేసి.. ఆంధ్రప్రదేశ్​కు ఆటంకం కలిగించాలని చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. తెలుగుజాతి పరువుపోయే పరిస్థితి వస్తే ఎవరినైనా ఎదిరిస్తామని స్పష్టం చేశారు.

చిత్తూరు జిల్లాలో సీఎం పర్యటన

By

Published : Mar 4, 2019, 4:08 PM IST

చిత్తూరు జిల్లాలో సీఎం పర్యటన
తెలంగాణప్రభుత్వంఐటీ కంపెనీల మీద దాడులు చేసి ఆటంకం కలిగించాలని చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ప్రధాని మోదీని విభేదించింది ప్రజల కోసమే అని స్పష్టంచేశారు. తెలుగుజాతి పరువుపోయే పరిస్థితి వస్తే ఎవరినైనా ఎదిరిస్తామని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడుజగన్ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ధైర్యముంటే ఎదురుగా వచ్చి తేల్చుకోండని సవాల్ విసిరారు. ఎవరికీ, దేనికీ భయపడేది లేదని తేల్చి చెప్పారు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు... మదనపల్లె సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details