అనంతపురం జిల్లా ప్రశాంతి నిలయంలో తమిళనాడు, కేరళీయుల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా ఈ 2 రాష్ట్రాలకు చెందిన భక్తులు సత్యసాయి సన్నిధిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం తమిళనాడు నూతన సంవత్సర వేడుకలు జరగాయి.. నేటి కేరళీయుల ఉత్సవం కోసం సాయికుల్వంత్ మందిరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పర్తియాత్ర పేరుతో కేరళీయులు 2 వేల మంది పుట్టపర్తికి వచ్చారు. ఉదయం ఓంకారం, వేదపఠనంతో సంబరాలు ప్రారంభమయ్యాయి. సత్యసాయి బాల వికాస్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. పలువురు సత్యసాయి భక్తిగీతాలను ఆలపిస్తూ మైమరపించారు. పలు నాటికలను ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు. ప్రముఖ గాయకులు అభిరామ్ అజయ్ బృందం కచేరి అందరినీ అలరించింది.
ఘనంగా తమిళ,కేరళీయులు నూతన సంవత్సర వేడుకలు - sai kulwath temple
అనంతపురం జిల్లాలో తమిళ,కేరళీయుల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రశాంతి నిలయంలో ప్రతిఏటా 2రాష్ట్రాల ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించటం ఆనావాయితీగా వస్తుందని భక్తులు తెలిపారు. సర్వాంగ సుందరగా సాయికుల్వంత్ మందిరాన్నిముస్తాబు చేశారు.
ఘనంగా తమిళ,కేరళీయులు నూతన సంవత్సర వేడుకలు